Asia cup 2025: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు పరిస్థితులు
ఈసారి ఆసియా కప్‌లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగనుంది. పలు సంవత్సరాలుగా రాజకీయ కారణాల వల్ల ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించలేదు. ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ కేవలం ఐసీసీ లేదా ఆసియా కప్ వంటి అంతర్జాతీయ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత, పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్‌లను ఆడకూడదని చాలామంది భారత అభిమానులు కోరుతున్నారు. అయినప్పటికీ, BCCI స్పష్టత ఇచ్చింది – అంతర్జాతీయ టోర్నీలో ఇది తప్పనిసరి. అందుకే సెప్టెంబర్ 14న జరగబోయే ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
కాగా, గతంలో ఇలాంటి మ్యాచ్‌లపై భారీ ఉత్సాహం, టికెట్‌లు దక్కించుకోవడం హాట్ టాపిక్ అయినప్పటికీ, ఈసారి అటువంటి క్రేజీ ఆసక్తి కనపడడం లేదు. టికెట్లు మిగిలిపోతున్నాయని, టీవీ వీక్షణ రేటింగ్స్ కూడా తగ్గే అవకాశమున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత్ స్పష్టమైన అగ్రగామి
భారత జట్టు ఇప్పటి వరకు ఆసియా కప్‌ను ఎనిమిది సార్లు గెలుచుకుంది – ఏడుసార్లు వన్డే ఫార్మాట్‌లో, ఒకసారి టీ20 ఫార్మాట్‌లో. పాకిస్తాన్ మాత్రం కేవలం రెండు సార్లు మాత్రమే ఆసియా కప్ విజేతగా నిలిచింది. టీ20 ఫార్మాట్‌లో మాత్రం పాకిస్తాన్ ఇప్పటివరకు కప్పు పొందలేదు.
భారత-పాకిస్తాన్ ముఖాముఖి మ్యాచ్‌లలో ఇప్పటివరకు 19 సార్లు తలపడగా, భారత్ 10 సార్లు గెలిచింది, పాకిస్తాన్ ఆరు సార్లు, మిగతా మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
ఫార్మాట్‌కు సంబంధం లేదు, భారత్ ఫేవరెట్
ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో ఇప్పటివరకు మూడు సార్లు జరిగింది. ఇందులో టీమ్‌ఇండియా రెండు సార్లు విజయం సాధించి, పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో కూడా భారత్ పరాక్రమమే ఎక్కువ.
ప్రస్తుతం భారత యువ ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. పాకిస్తాన్ జట్టు మాత్రం అంత శక్తివంతంగా కనిపించడం లేదు. గెలుపు ఎవరిదో చెప్పడం సెప్టెంబర్ 14న క్లియర్ అవుతుంది.