Annadata Sukhibhava 2nd Installment 2025: రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్న సమయం తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హ రైతులకు అండగా నిలిచేందుకు అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల జమకి సిద్ధంగా ఉంది. పీఎం కిసాన్ పథకం తో కలిపి ప్రతి సంవత్సరం రైతులకు రూ.20,000 లబ్ధి అందించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. మొదటి విడత నిధులు ఈ సంవత్సరం ఆగస్టు 2న రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడ్డాయి.
ప్రస్తుతం రెండో విడత నిధులు అక్టోబర్ 18న ఖాతాల్లో జమ చేయడం కోసం ప్రణాళిక రూపొందించారు. దీపావళి పండుగ సందర్భంగా రైతులకు నిధులు అందేలా ప్రత్యేక షెడ్యూల్ సిద్ధం చేయబడింది. ఇందులో కేంద్రం నుంచి రూ.2,000 మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5,000 చొప్పున మొత్తం రూ.7,000 విడుదల చేయనున్నది.
పీఎం కిసాన్ పథకం కౌలు రైతులకు వర్తించకపోవడం వల్ల, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అన్నదాత సుఖీభవ పథకం కింద కౌలు రైతులకు రెండు విడతల్లో రూ.20,000 చెల్లించనుంది. తొలిసారి అక్టోబర్‌లో రూ.10,000 నిధులు ఖాతాల్లో జమ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు సుమారు 46.64 లక్షల రైతు కుటుంబాలను ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. భూ సమాచారం వెబ్‌ల్యాండ్ ద్వారా సేకరించి, గ్రామ స్థాయిలో ధృవీకరణ పూర్తిచేశారు. రైతులు తమ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో అన్నదాత సుఖీభవ పోర్టల్ లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. భూమి లేని కౌలు రైతులు తమ కౌలు గుర్తింపు కార్డు పొందిన తర్వాత ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. అర్హులు అయినా కూడా జాబితాలో పేరు లేకపోతే, ప్రభుత్వం ద్వారా గ్రీవెన్స్ పద్ధతిలో ఫిర్యాదు చేసి సాయం పొందవచ్చు.
ఈ పథకం రైతుల జీవితాన్ని సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రభుత్వ సూచనలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించడం ద్వారా మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. అర్హ రైతులు జాబితా, డాక్యుమెంట్లు, నిధుల స్టేటస్ తప్పకుండా తనిఖీ చేసుకోవాలి.
Annadata Sukhibhava Payment Status 2025: అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ఎ లా చెక్ చేయాలి?
https://annadathasukhibhavastatus.in/