Mahavatar Narsimha: ఓటీటీలో ఆ రోజు నుండి రికార్డులు సృష్టించడానికి సిద్ధమైన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్…
Mahavatar Narsimha సినిమా కేవలం 40 కోట్ల తక్కువ బడ్జెట్‌తో రూపొందినా థియేటర్లలో విడుదలైన వెంటనే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇండియాలో 249 కోట్ల వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా 340 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్‌గా నిలిచింది. దర్శకుడు అశ్విన్ కుమార్ భక్త ప్రహ్లాదుడి కథను అద్భుతమైన యానిమేషన్, భావోద్వేగభరితమైన స్క్రీన్‌ప్లే, విజువల్ గ్రాండియర్‌తో చూపించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నరసింహ అవతారం, హిరణ్యకశిపుడి వధ ఘట్టం థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ కలిగించింది. కుటుంబాలతో కలిసి చూసే సినిమాగా మారి అన్ని వయసుల ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
థియేటర్లలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్ 19న మధ్యాహ్నం 12:30 గంటలకు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా పలు భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ మాస్టర్‌పీస్‌ను చూడవచ్చు. సోషల్ మీడియాలో ఓటీటీ రిలీజ్‌పై హైప్ క్రియేట్ అవుతోంది, ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. డిజిటల్ రిలీజ్‌తో మరింత పెద్ద ఆడియన్స్‌కు చేరి కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.
ఈ విజయంతో మేకర్స్ మహావతార్ సినెమాటిక్ యూనివర్స్‌ను (MCU) ప్రకటించారు. త్వరలో మహావతార్ పరశురామ్, మహావతార్ రఘునందన్, మహావతార్ ద్వారకాధీశ్, మహావతార్ గోకులానంద, మహావతార్ కల్కి చిత్రాలను రూపొందించబోతున్నారు. పురాణ గాథలను ఆధునిక విజువల్స్‌తో చూపించడం ద్వారా భారతీయ యానిమేషన్ ఇండస్ట్రీకి కొత్త దశను తెరుస్తుంది.