Bigg Boss Telugu 9: నేటి నామినేషన్స్ ప్రోమో… హరీష్ – శ్రీజ మధ్య ఘర్షణ, మొత్తం 9 మంది నామినేట్!

మూడో వారం నామినేషన్స్: గొడవలు, డ్రామా ఫుల్ డోస్ హరీష్ వర్సెస్ శ్రీజ హైలైట్ |Bigg Boss Telugu 9

Bigg Boss Telugu 9 తెలుగు మూడో వారం నామినేషన్స్ ప్రోమో హౌస్‌లో పెద్ద హంగామా క్రియేట్ చేసింది. ఆదివారం ఎలిమినేషన్‌తో ఒకరు బయటకు వెళ్లగానే, సోమవారం నామినేషన్స్‌తో మరో వారం హౌస్‌లో గందరగోళం మొదలైంది. మొదటి వారంలో సెలబ్రిటీ శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయ్యింది. రెండో వారంలో కామనర్ మర్యాద మనీష్ బయలుదేరాడు. ఇప్పుడు మూడో వారానికి రంగం సిద్ధం కాగా, నామినేషన్స్ ప్రోమోలో హౌస్ మేట్స్ మధ్య చిచ్చు చెలరేగింది.

ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కామనర్స్ హరీష్, ప్రియ, శ్రీజ, కళ్యాణ్, డీమాన్ పవన్‌లకు బిగ్ బాస్ ప్రత్యేక టాస్క్ ఇచ్చాడు. ఈ ఐదుగురిలో ఒకరు తప్పనిసరిగా నామినేట్ అవ్వాలి అని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో ఐదుగురిలో ఘర్షణలు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ తమను తాము రక్షించుకోవడానికి యత్నించగా, చివరికి ఒకరిని నామినేట్ చేయాల్సి రావడంతో వాదోపవాదాలు జోరందుకున్నాయి.

ఓనర్స్ సైడ్ నుంచి హరీష్, ప్రియ శెట్టిలు కెప్టెన్ సంజనను నామినేట్ చేశారు. కెప్టెన్ అయిన తర్వాత ఆమెలో అహం పెరిగిందని కారణం చెప్పారు. అలాగే సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతూ చౌదరిలను కూడా నామినేట్ చేశారు. ఇక కామనర్స్ వైపు నుండి దమ్ము శ్రీజ హరీష్‌ను నామినేట్ చేసింది. కారణంగా “ఉమెన్‌ను డీగ్రేడ్ చేయడం నాకు నచ్చలేదు” అని చెప్పింది. దీనికి హరీష్ మండిపడి “అమ్మాయిలను ఎంత గౌరవిస్తానో నాకు మాత్రమే తెలుసు” అంటూ శ్రీజతో మాటల యుద్ధానికి దిగాడు. ఈ ఘర్షణ ప్రోమోలో హైలైట్‌గా మారింది.

నామినేషన్స్ ప్రోమోలో హరీష్, శ్రీజ వాదనలు, మర్యాద హరీష్ కామెంట్స్, ఢమాల్ పవన్ రియాక్షన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా ఈ వారం సంజన, సుమన్ శెట్టి, ఫ్లోరా, రీతూ చౌదరి, హరీష్ సహా మొత్తం 9 మంది నామినేషన్స్‌లో నిలిచారు. కానీ వీరిలో ఇద్దరు సేవ్ అయ్యే అవకాశం ఉంది. కెప్టెన్ డీమాన్ పవన్‌కి ఉన్న స్పెషల్ పవర్స్‌ను ఎవరిపై వాడతారు? ఫైనల్ నామినేషన్స్ లిస్ట్ ఎలా ఉండబోతోంది? అన్నది ఈరోజు ఎపిసోడ్‌లో క్లారిటీ రానుంది.

మొత్తానికి  Bigg Boss Telugu 9 మూడో వారం నామినేషన్స్‌లో డ్రామా, ఎమోషన్స్, గొడవలు అన్నీ ఫుల్‌గా ఉన్నాయి. హౌస్‌లో ఎవరెవరు సేఫ్ అవుతారు, ఎవరెవరు ఎలిమినేషన్ ఫేస్ చేస్తారు అన్నది చూడాల్సిందే. బిగ్ బాస్ అభిమానులు ఈ వారం ఎపిసోడ్ మిస్ కాకూడదు!