HEALTH అబ్బో.. వారానికి మూడుసార్లు రామెన్ నూడుల్స్‌ తింటే చావు తప్పదా? పరిశోధన చెబుతున్న నిజం

రామెన్ నూడుల్స్‌ ఎక్కువగా తింటే ప్రాణాలకు ముప్పు – తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు | HEALTH | ramen noodles risk factors

HEALTH: జపాన్‌లోని యమగాటా ప్రిఫెక్చర్ విశ్వవిద్యాలయాలు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం, రామెన్ నూడుల్స్‌ను తరచుగా తినే వ్యక్తుల్లో మరణ ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉందని తేలింది. ముఖ్యంగా వారానికి మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ రామెన్‌ తినేవారు, వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తినేవారితో పోలిస్తే మరణ ప్రమాదం 1.5 రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ramen-noodles-risk-factors ఈ అధ్యయనంలో 40 ఏళ్లు పైబడిన 6,725 మంది నివాసితులు నాలుగున్నర సంవత్సరాల పాటు పరిశీలించబడ్డారు. వారిని రామెన్ వినియోగం ఆధారంగా వర్గీకరించగా, తరచుగా తినేవారిలో మరణ రిస్క్‌ ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా 70 ఏళ్లలోపు పురుషులు అధిక ప్రభావితమైనట్లు తేలింది.

రామెన్ నూడుల్స్‌లోని ప్రధాన సమస్య రసం. ఇందులో అధికంగా ఉప్పు (సోడియం) ఉంటుంది. దీన్ని పూర్తిగా తాగితే శరీరంలో సోడియం స్థాయులు అసాధారణంగా పెరిగి అనేక సమస్యలు వస్తాయి. వాటిలో అధిక రక్తపోటు, హార్ట్ స్ట్రోక్, కడుపు క్యాన్సర్ ప్రధానమైనవి. అంతేకాదు, రామెన్ నూడుల్స్‌లోని ప్రాసెస్ చేసిన పదార్థాలు, అధిక కొవ్వు, మసాలా కూడా ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావం చూపుతాయి. క్రమం తప్పకుండా మద్యం సేవించే వారు రామెన్‌ ఎక్కువగా తింటే, వారి మరణ ప్రమాదం మితంగా తినేవారితో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనం చెబుతోంది.

నిపుణుల ప్రకారం రామెన్ తిన్నా రసం పూర్తిగా తాగకపోవడం మంచిది. కూరగాయలు, గుడ్లు, ప్రోటీన్ పదార్థాలు జోడించడం ద్వారా కొంత పోషక విలువ పెంచుకోవచ్చు. అలాగే వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే పరిమితం చేయడం శ్రేయస్కరం. తరచుగా తినడం వల్ల శరీరంలో సోడియం, కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరుగుదల వంటి సమస్యలు వస్తాయి. అప్పుడప్పుడు రామెన్ తినడం పెద్ద సమస్య కాదు. కానీ అలవాటుగా వారానికి మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువగా తింటే, అది ప్రాణాలకు ముప్పుగా మారవచ్చు. ఈ కారణంగా నిపుణులు రామెన్‌ను మితంగా తినాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.