AP Outsourcing Jobs 2025: ఏపీ మెడికల్ కాలేజీ & హాస్పిటల్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ప్రభుత్వ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ లో 41 ఖాళీలు అర్హతలు, వయోపరిమితి, జీతభత్యాల వివరాలు. | AP Outsourcing Jobs 2025

AP Outsourcing Jobs 2025 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి విడుదలైంది. శ్రికాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ (GMC) మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH) లో మొత్తం 41 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ నియామకం ద్వారా నిరుద్యోగులకు తక్కువ అర్హతలతో కూడా మంచి అవకాశం లభిస్తోంది. దరఖాస్తు ప్రక్రియ 23 సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభమై, 01 అక్టోబర్ 2025 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

ఈ నోటిఫికేషన్‌లో Government Medical College, Srikakulam లో Attender, Book Bearer, Lab Attendant, Assistant Librarian పోస్టులు ఉన్నాయి. Government General Hospital, Srikakulam లో ECG Technician, Data Entry Operator, Carpenter, Male Nursing Orderly, Female Nursing Orderly, Nursing Orderly, Theatre Assistant, Office Attendant, Dresser, Stretcher Bearer, Driver, Vehicle Cleaner వంటి పోస్టులు ఉన్నాయి. కలిపి మొత్తం 41 ఖాళీలు ఉన్నాయి.

ప్రతి పోస్టుకు ప్రత్యేక అర్హతలు నిర్దేశించారు. ECG Technician పోస్టులకు Intermediate, ECG Diploma మరియు AP Paramedical Board Registration అవసరం. Data Entry Operator కి Degree తో పాటు Computers Specialization లేదా PGDCA ఉండాలి. Carpenter కి ITI Certificate తప్పనిసరి. MNO, FNO, Nursing Orderly కి SSC, కనీసం 3 ఏళ్ల అనుభవం మరియు First Aid Certificate అవసరం. Theatre Assistant పోస్టుకు SSC తో పాటు 5 ఏళ్ల అనుభవం ఉండాలి.

Office Attendant, Attender, Book Bearer, Stretcher Bearer, Vehicle Cleaner కి SSC సరిపోతుంది. Lab Attendant కి SSC + Lab Attendant Course లేదా Intermediate Vocational అవసరం. Assistant Librarian కి Degree లేదా Master in Library Science లో కనీసం 50% మార్కులు ఉండాలి. Dresser కి SSC, 3 ఏళ్ల Hospital అనుభవం మరియు First Aid Certificate అవసరం. Driver పోస్టుకు SSC, చెల్లుబాటు అయ్యే Driving License, 3 ఏళ్ల అనుభవం, Motor Mechanism Knowledge ఉండాలి.

అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. SC, ST, BC, EWS వారికి 5 సంవత్సరాలు, PH అభ్యర్థులకు 10 సంవత్సరాలు, Ex-Servicemen కు 3 సంవత్సరాలు + సర్వీస్ పీరియడ్ వయోసడలింపు లభిస్తుంది. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. విద్యార్హత మార్కులకు 75% వెయిటేజ్, అర్హత తర్వాత ప్రతి సంవత్సరానికి 10 మార్కులు, Outsourcing/Contract/ Honorarium సర్వీసులకు 15% వెయిటేజ్ ఉంటుంది.

జీతభత్యాలు పోస్టును బట్టి ఉంటాయి. Attender, Office Attendant, Nursing Orderly, MNO, FNO, Theatre Assistant, Dresser, Stretcher Bearer, Vehicle Cleaner పోస్టులకు ₹15,000, Lab Attendant కి ₹18,500, Assistant Librarian కి ₹27,045, ECG Technician కి ₹21,500, Data Entry Operator, Carpenter, Driver కి ₹18,500 జీతం ఉంటుంది.

దరఖాస్తు కోసం అభ్యర్థులు srikakulam.ap.gov.in నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసి, పూర్తి వివరాలతో Government Medical College, Srikakulam Principal Office లో సమర్పించాలి. చివరి తేదీ 01 అక్టోబర్ 2025. Provisional Merit List 09 అక్టోబర్, Final Merit List 15 అక్టోబర్ 2025న విడుదల కానుంది.

పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి