10వ తరగతి అర్హతతో అప్లై చేయండి | Anganwadi Jobs 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ నియామకానికి కనీస అర్హత 10వ తరగతి ఉత్తీర్ణత మాత్రమే కావడంతో అనేక మంది మహిళా అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం.Anganwadi Jobs ICDS ప్రాజెక్ట్, జిల్లా మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి కార్యాలయం లో అంగన్వాడీ కార్యకర్త (Anganwadi Teacher) పోస్టుల భర్తీకి మొత్తం 07 పోస్టులు విడుదల అయ్యాయి. ఎంపికైన ఉద్యోగులకు నెలకు ₹11,500/- గౌరవ వేతనం చెల్లించబడుతుంది మరియు దరఖాస్తు విధానం కేవలం ఆఫ్‌లైన్‌లోనే ఉంటుంది.
ఈ నియామకానికి అర్హత పొందాలంటే అభ్యర్థి స్థానిక స్థిర నివాసి అయి ఉండాలి మరియు వివాహిత స్త్రీ అభ్యర్థి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు పరిమితి 21 నుండి 35 సంవత్సరాలు (01-07-2025 నాటికి) ఉండాలి. SC/ST అంగన్వాడీ కేంద్రములకు SC/ST అభ్యర్థులకే అవకాశం ఉంది. అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు 18 ఏళ్లు నిండిన అభ్యర్థుల దరఖాస్తులు కూడా పరిగణనలోకి తీసుకోబడతాయి.
Anganwadi Jobs అంగన్వాడీ టీచర్ పోస్టుల ఎంపిక విధానం జిల్లా స్థాయి ఎంపిక కమిటీ నిర్వహించే మౌఖిక పరీక్ష (Interview) ద్వారా ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నియామకం పూర్తిగా తాత్కాలికం. దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు నేటివిటీ/నివాస ధృవీకరణ పత్రం, ఆధార్, రేషన్ కార్డు, ఓటరు ID, 10వ తరగతి సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC), అవసరమైతే EWS మరియు వైకల్య ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో ఈ డాక్యుమెంట్లను గెజిటెడ్ అధికారిచే అట్టి స్టేషన్ చేయించి సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయం కి నేరుగా గాని లేదా పోస్టు ద్వారా గాని 29-09-2025 నుండి 10-10-2025 సాయంత్రం 5:00 గంటలలోపు సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత, జిల్లా స్థాయి కమిటీ ద్వారా మౌఖిక పరీక్ష తేదీ మరియు స్థలం తెలియజేయబడుతుంది. ఆఫ్‌లైన్ అప్లికేషన్ మాత్రమే పరిగణనలోకి తీసుకోబడుతుంది. అభ్యర్థులు తమ నివాస, కుల, విద్యార్హత మరియు వివాహ వివరాలు సరిగ్గా నిర్ధారించాలి. అంగన్వాడీ కేంద్రాలు, పోస్టుల ఖాళీలు మరియు రోస్టర్ వివరాలు సంబంధిత ICDS ప్రాజెక్ట్ కార్యాలయంలో లభిస్తాయి.
Anganwadi Jobs 2025 లో కేవలం 10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగం పొందే అవకాశం ఉంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మహిళలకు ఇది గవర్నమెంట్ జాబ్ పొందడానికి మంచి అవకాశం. అభ్యర్థులు చివరి తేదీకి ముందే తమ ఆఫ్‌లైన్ అప్లికేషన్ సమర్పించుకోవాలి. అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం కోసం https://visakhapatnam.ap.gov.in/ ను సందర్శించవచ్చు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న సమాచారం ఆధారంగా, సరైన డాక్యుమెంట్స్ మరియు సమయానికి అప్లికేషన్ సమర్పించడం అత్యంత ముఖ్యం.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి