Ap Ration Card: రేషన్ కార్డుదారులకు ముఖ్య హెచ్చరిక – అక్టోబర్ 30 వరకు మాత్రమే అవకాశం

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్ – అక్టోబర్ 30 వరకు తప్పులు సరిచేసుకునే అవకాశం | Ap Ration Card

రాష్ట్రంలో కొత్త రేషన్ పాలసీ (New Ration Policy)ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల పంపిణీ చేసిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో (Smart Ration Cards) కొన్ని లోపాలు బయటపడ్డాయి. పేర్లలో అక్షరదోషాలు, వయస్సు లేదా ఇంటి నంబర్లలో తప్పులు రావడంతో పలువురు కార్డు హోల్డర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 30 వరకు కార్డుల్లో ఉన్న తప్పులు, సవరణల కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. రేషన్ కార్డుదారులు తమ సమీప గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చని మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

➡️ తప్పులు సరిచేసే చివరి తేదీ: అక్టోబర్ 30, 2025
➡️ ఎక్కడ ఫిర్యాదు చేయాలి: మీ సమీప సచివాలయంలో
➡️ వర్తింపు: అన్ని రేషన్ కార్డుదారులు

🔗 సూచన: చివరి తేదీ దాటితే మార్పులు చేసుకోవడం కష్టమవుతుంది. కాబట్టి రేషన్ కార్డులు సరిచూసుకుని వెంటనే చర్యలు తీసుకోండి! ✅