బాల ఆధార్ కార్డు ఎలా తీసుకోవాలి? అవసరమైన డాక్యుమెంట్లు & దరఖాస్తు విధానం | Baal Aadhaar Card
Baal Aadhaar Card ప్రస్తుతం ప్రతి భారతీయ పౌరుడికీ ఆధార్ కార్డు తప్పనిసరి అయినట్టే, ఐదేళ్లలోపు చిన్నారులకు కూడా ప్రత్యేకంగా బాల ఆధార్ కార్డు లేదా బ్లూ ఆధార్ అందుబాటులో ఉంది. ఈ కార్డులో చిన్నారి పేరు, పుట్టిన తేదీ, ఫోటో ఉంటాయి. తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డుతో లింక్ చేసి ఇది జారీ అవుతుంది. ఐదేళ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు వేలిముద్రలు, కంటిపాప స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలు అవసరం ఉండవు. కానీ ఆ వయసు దాటిన తర్వాత తప్పనిసరిగా ఆధార్ అప్‌డేట్ చేయాలి. పిల్లలకు పాఠశాల అడ్మిషన్, ఆరోగ్య సేవలు, స్కాలర్‌షిప్‌లు, ప్రయాణం వంటి అనేక సందర్భాల్లో ఈ బాల ఆధార్ చాలా అవసరం అవుతుంది.
బాల ఆధార్ కార్డు పొందడానికి కొన్ని డాక్యుమెంట్లు అవసరం. చిన్నారి జనన సర్టిఫికేట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జ్ సమరీ, తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డు మరియు చిరునామా రుజువు పత్రాలు సమర్పించాలి. వీటితో పాటు అప్లికేషన్ ఫారమ్ పూరించాలి.
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే UIDAI వెబ్‌సైట్‌కి వెళ్లి My Aadhaar లో Book an Appointment ఆప్షన్ ఎంచుకోవాలి. నగరాన్ని సెలెక్ట్ చేసి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి OTP తో వెరిఫై చేయాలి. దగ్గరలోని ఆధార్ నమోదు కేంద్రానికి అపాయింట్‌మెంట్ తేదీ, సమయం బుక్ చేసుకోవాలి. ఆ రోజున తల్లిదండ్రుల్లో ఒకరు బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసి అవసరమైన పత్రాలు సమర్పించాలి. ప్రాసెస్ పూర్తయిన తర్వాత బాల ఆధార్ పోస్టులో ఇంటి చిరునామాకు వస్తుంది. UIDAI వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ ప్రాసెస్‌లో నేరుగా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి అప్లికేషన్ ఫారమ్ పూరించాలి. తల్లిదండ్రుల్లో ఒకరు తమ ఆధార్, బయోమెట్రిక్ వివరాలు అందజేయాలి. అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన తర్వాత ఒక Acknowledgment Slip వస్తుంది. దాంట్లో ఉన్న Enrolment ID తో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా 60 నుండి 90 రోజుల్లో బాల ఆధార్ కార్డు పోస్టులో వస్తుంది.
బాల ఆధార్ కార్డు ఎందుకు అవసరమంటే, ఇది చిన్నారికి అధికారిక గుర్తింపు పత్రం అవుతుంది. పాఠశాలలో అడ్మిషన్, ప్రభుత్వ పథకాలు, ఆరోగ్య బీమా వంటి సదుపాయాల్లో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రయాణాల సమయంలో కూడా ఇది చాలా ఉపయోగకరం.
మొత్తానికి Baal Aadhaar Card 2025 ప్రతి చిన్నారికి తప్పనిసరి పత్రంగా మారింది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్‌తో లింక్ చేసి సులభంగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం ఈ బ్లూ ఆధార్ కార్డు వెంటనే పొందడం మంచిది