‘ఐ బొమ్మ’పై పోలీసుల దృష్టి, సంచలన ప్రకటన వైరల్ | ibomma telugu movies
తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ అనే సమస్య కొత్తది కాదు. సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యిన కొద్ది గంటల్లోనే వాటి పైరసీ ప్రింట్లు ఆన్‌లైన్‌లోకి రావడం, ముఖ్యంగా ibomma telugu movies లాంటి వెబ్‌సైట్ల ద్వారా విస్తృతంగా వ్యాప్తి చెందడం పరిశ్రమకు పెద్ద సవాలుగా మారింది. తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుపై దృష్టి సారించారు.
పోలీసుల దర్యాప్తులో థియేటర్‌లలో కెమెరాల సాయంతో రికార్డింగ్ చేసే వ్యక్తులతో పాటు, సర్వర్లను హ్యాక్ చేస్తున్న నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఐబొమ్మ తరపున ఒక సంచలన ప్రకటన విడుదలై, అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ ప్రకటనలో సినిమాలకు అధిక బడ్జెట్ పెట్టి, ఆ భారాన్ని ప్రేక్షకులపై రుద్దుతున్నారని వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా మధ్య తరగతి ప్రేక్షకులే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని, వారికోసం తాము పనిచేస్తున్నామని ఐబొమ్మ పేర్కొనడం గమనార్హం. అయితే, ఇది కొత్త ప్రకటననా? లేక పాతదా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. గతంలోనూ ఇలాంటి ప్రకటనలు విడుదల కావడం విశేషం.
సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే బిహార్, ఉత్తరప్రదేశ్‌లలో ఐబొమ్మ కోసం పని చేస్తున్న ఏజెంట్లను గుర్తించారు. ఓటీటీ కంటెంట్‌ను దొంగిలించి అప్‌లోడ్ చేస్తున్న రాకెట్లపై కఠిన చర్యలు చేపట్టే ప్రయత్నంలో ఉన్నారు.