వంద రూపాయల టెంపర్డ్ గ్లాస్ వాడుతున్నారా? ముందు ఇది తెలుసుకోండి! | Mobile Tips
Mobile Tips మొబైల్ ఫోన్ కొనడానికే వేలల్లో లేదా లక్షల్లో ఖర్చు చేస్తాం. కానీ స్క్రీన్ రక్షణ కోసం చవకైన రూ.100 టెంపర్డ్ గ్లాస్ వాడుతూ ఉంటాం. ఇది ఫోన్ డిస్‌ప్లేకు సరైన రక్షణ ఇవ్వడమే కాకుండా టచ్ సెన్సిటివిటీ, బ్రైట్‌నెస్, కలర్ క్వాలిటీ అన్నిటినీ తగ్గిస్తుంది. రోడ్డు పక్కన దొరికే తక్కువ ధర గ్లాస్‌లు స్మూత్‌గా ఉండవు. వీటిపై గీతలు త్వరగా పడతాయి. వేలిముద్రలు సులభంగా కనిపిస్తాయి. శుభ్రం చేయడం కూడా కష్టమే. ముఖ్యంగా మందంగా ఉండే నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌లు స్క్రీన్ టచ్ సెన్సిటివిటీని తగ్గిస్తాయి. ఫోన్ స్క్రీన్‌పై టచ్ చేసేటప్పుడు ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది. రానురాను టచ్ స్పీడ్ తగ్గిపోవడానికి ఇదే కారణం.
ప్లాస్టిక్ టెంపర్డ్ గ్లాస్ బలంగా ఉంటాయి కానీ డిస్‌ప్లేలోని అసలు బ్రైట్‌నెస్, కలర్ క్వాలిటీని తగ్గిస్తాయి. సినిమాలు, వీడియోలు చూడడంలో ఒరిజినల్ ఎక్స్‌పీరియెన్స్ రావడంలేదు. కర్వ్‌డ్ స్క్రీన్‌లకు చౌకైన గ్లాస్‌లు పనికిరావు. అంచుల్లో గ్లాస్ ఊడిపోవడం, బబుల్స్ పడటం వంటి సమస్యలు వస్తాయి. ఒకసారి బబుల్స్ వస్తే మొత్తం స్క్రీన్ గార్డ్‌ను మార్చాల్సి వస్తుంది.
Mobile Tips ఫోన్‌కు నిజమైన రక్షణ కావాలంటే ఎప్పుడూ బ్రాండెడ్ లేదా ఒరిజినల్ టెంపర్డ్ గ్లాస్ వాడాలి. మీ మొబైల్ కర్వ్‌డ్ డిస్‌ప్లే అయితే ఎడ్జ్ లేదా 3D గ్లాస్ మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలి. గ్లాస్‌కు కనీసం 99 శాతం ట్రాన్స్‌పరెన్సీ రేటు ఉండాలి. అలా ఉంటే డిస్‌ప్లే క్వాలిటీ మారకుండా ఉంటుంది. టెంపర్డ్ గ్లాస్ మందం 0.3 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ కాకూడదు. అంతకంటే ఎక్కువ అయితే టచ్ స్పీడ్ తగ్గిపోతుంది.
చవకైన టెంపర్డ్ గ్లాస్ వాడటం వల్ల మొదట్లో డబ్బు ఆదుకున్నట్టే అనిపించినా చివరికి మీ ఫోన్ డిస్‌ప్లేకి నష్టం కలుగుతుంది. కాబట్టి నాణ్యమైన గ్లాస్‌ను ఎంచుకోవడమే మంచి నిర్ణయం.