7,565 కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ – ఇంటర్ అర్హతతో దరఖాస్తు చేసుకోండి | SSC Constable Jobs 2025
SSC Constable Jobs 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఢిల్లీ పోలీస్ సర్వీస్‌లో మొత్తం 7,565 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులను భర్తీ చేయనున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమాచారం అందింది. ఇంటర్మీడియట్ (10+2) అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
SSC Constable Jobs 2025 ఈ నోటిఫికేషన్ కింద కానిస్టేబుల్ పురుషుల కోసం 4,408 ఖాళీలు, మహిళల కోసం 2,496 ఖాళీలు, ఎక్స్ సర్వీస్‌మెన్ ఇతరులు కోసం 285 ఖాళీలు, ఎక్స్ సర్వీస్‌మెన్ కమాండో కోసం 376 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 7,565 ఖాళీలకు ఈ నియామకం జరగనుంది. పురుష అభ్యర్థులు తప్పనిసరిగా LMV (మోటార్ సైకిల్ లేదా కారు) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే 2025 జూలై 1 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు ఉండాలి. అయితే SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ రాత పరీక్ష (CBT), ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (PET), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT) ఆధారంగా జరుగుతుంది. తుది ఎంపికలో మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులను నియమిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700 నుండి రూ.69,100 వరకు జీతం లభిస్తుంది. అదనంగా ప్రభుత్వ నియమావళి ప్రకారం ఇతర అలవెన్సులు, భత్యాలు కూడా అందజేయబడతాయి. ఈ ఉద్యోగాలు స్థిరమైన భవిష్యత్ కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా భావించవచ్చు.
దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ (ssc.nic.in) ద్వారా One Time Registration పూర్తి చేసి దరఖాస్తు ఫారం ఫిల్ చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లింపు పూర్తి చేయాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. అయితే SC, ST, మహిళా అభ్యర్థులు, ఎక్స్ సర్వీస్‌మెన్ మరియు దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 21, 2025గా నిర్ణయించారు. ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ అక్టోబర్ 22, 2025. దరఖాస్తు సవరణలు అక్టోబర్ 29 నుండి అక్టోబర్ 31 వరకు చేయవచ్చు. ఈ గడువులు మిస్ కాకుండా అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి.
SSC Constable Jobs 2025 నోటిఫికేషన్ నిరుద్యోగ యువతకు పెద్ద అవకాశం. ముఖ్యంగా ఇంటర్ పాసైన వారికి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. కానిస్టేబుల్ పోస్టులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో జీతం, భద్రత, కెరీర్ పరంగా ఇవి చాలా ప్రాధాన్యం కలిగిన ఉద్యోగాలు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా అధికారిక వెబ్‌సైట్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం కోసం అభ్యర్థులు ssc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి